రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్..? : చంద్రబాబు
విశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబు.. విశాఖ శ్రేణుల్లో జోష్ నింపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 5 ప్రధాన కూడళ్లలో రోడ్‌షోలు నిర్వహించారు. ముందుగా పెందుర్తి జంక్షన్‌లో రోడ్ షోలో ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి నుంచి చినముషిడివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్‌ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాటిచెట్లపాలెం మీదుగా అక్కయ్యపాలెం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు.
విశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు. ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దాడులతో టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండ విజయం అందించాలని కోరారు. 22 నెలల సీఎం జగన్ పాలనలో విశాఖ అభివృద్ధి శూన్యమని చంద్రబాబు తప్పుబట్టారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్న చంద్రబాబు.. రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్...? అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏ1కు ఎప్పుడూ భూములపైనే ధ్యాస అని.. విశాఖలో ఏ2 పెత్తనమేంటని ప్రశ్నించారు.
రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు చంద్రబాబు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జీవీఎంసీ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. విశాఖలో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో మంచి జోష్ వచ్చింది.
RELATED STORIES
Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMTSrilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్...
24 May 2022 7:47 AM GMTPetrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMT