AP : చంద్రబాబుకు పరిపూర్ణానంద షాక్

ఏపీలో టీడీపీ కూటమికి మరో షాక్ తగిలింది. హిందూపురం పార్లమెంటు సీటును ఆశించిన పరిపూర్ణానంద స్వామి కనీసం అసెంబ్లీ సీటైనా ఇవ్వాలని అడుగుతున్నారు. రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.
పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కుతుందని.. ఎంపీ అవుతానని గట్టి నమ్మకం ప్రదర్శించారు పరిపూర్ణానంద. కానీ ఈ పరిధిలోని రెండు టికెట్లు టీడీపీకే దక్కాయి. ఎంపీ టికెట్ టీడీపీ అభ్యర్థి బికే పార్థసారధికి దక్కింది. దీంతో.. ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగేందుకు స్వామి సిద్ధమయ్యారు.
అభ్యర్థుల మార్పు సమాచారంతో స్వామి పరిపూర్ణానంద ఇటీవల చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరుతారని చాలా బలంగా వినిపించింది. ఐతే.. ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని.. లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బాబుకు స్వామి చెప్పారట. ఈ పరిణామంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఎలాగైనా బీజేపీతో మాట్లాడి స్వామిని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com