Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు: చంద్రబాబు

X
Chandrababu: టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధిలో ముందుంటే.. వైసీపీ పాలనలో అత్యధిక పన్నుల భారం మోపుతున్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానానికి చేరిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పెట్రోల్ ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ముందుకు రావాలన్నారు.
గతేడాది చివర్లో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. ఏపీలో ఇప్పటికీ పైసా తగ్గించుకపోగా.. అదనపు పన్నులతో మరింత భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు పన్నులు తగ్గించాయని..ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
