AP : చంద్రబాబు అస్త్రం.. ఏపీలో రీఎంట్రీకి జయప్రద రెడీ

జయప్రద (Jayaprada) తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని జయప్రద అన్నారు. ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. ఏపీ పాలిటిక్స్‌పై తనకు ఆసక్తి ఉందన్నారు. ఇప్పటికే ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించినందున, వచ్చే అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె వెల్లడించారు. ఏపీలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉండాలని భావిస్తున్నట్లు జయప్రద చెప్పారు.
బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో పాల్గొనాలనే కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని ఆమె చెప్పారు. తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ అధిష్టానమే అని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎలా చెబితే తాను అలా నడుచుకుంటానని తేల్చి చెప్పారు.
మూడో సారి దేశంలో మోడీ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు జయప్రద. తనకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అంటే చాలా ఇష్టమన్నారు. మోదీ, చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com