ఆంధ్రప్రదేశ్

Chandrababu: వైసీపీ గూండాలు అడ్డుకుని దాడి చేశారు: చంద్రబాబు

Chandrababu: పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు.

Chandrababu: వైసీపీ గూండాలు అడ్డుకుని దాడి చేశారు: చంద్రబాబు
X

Chandrababu: పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే అంగర రామ్మోహన్‌పై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. లెటర్‌తో పాటు దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు జత చేశారు. ఇద్దరు నేతలు వేదికపైకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాక.. దాడికి చేశారని లెటర్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు కింద పడిపోయి గాయపడ్డారని తెలిపారు.

టీడీపీ ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయన్నారు చంద్రబాబు. ఇక ఇద్దరూ ప్రజా ప్రతినిధులపై దాడి జరుగుతున్నా.. అక్కడున్న డీఎస్పీ సహా పోలీసులు ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణం టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ గూండాలను అరెస్ట్‌ చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహించిన పోలీసులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES