AP : ఇప్పటినుంచి ఇంకో లెక్క.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈలోగానే ముఖ్యమంత్రి కార్యాలయం సహా కీలక విభాగాల్లో పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఐఎఎస్, ఐపీఎస్ మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. సీఎంఓలో పూర్తి ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలతో రివ్యూ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని, బ్యూరోక్రాట్ల పాలన ఎంతమాత్రం ఉండదని స్పష్టం చేశారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, ఇకముందు అలా ఉండదని తేల్చి చెప్పారు. మీరే ప్రత్యక్షంగా చూస్తారనీ.. ఎంపీలు అందరూ తరచూ వచ్చి కలవండి.... బిజీగా ఉన్నా కూడా పక్కకు వచ్చి మాట్లాడి వెళ్తానని చంద్రబాబు తెలిపా పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఐదేళ్ళు పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చారని, కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని తెలిపారు.
అధికార పార్టీ వత్తిడికి ఎవరూ తలొగ్గకుండా పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టారన్నారు. ఇకనుంచి ప్రతి అంశం నేను వింటాను.. నేనేచూస్తాను. ఇక ముందు రాజకీయ పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. అందరూ కలిసి పనిచేయాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి పనిచేయాలని కోరారు. ఎవరి పరిధిలు ఏమిటో తాను స్పష్టంగా చెపుతానని, అందరూ ఎవరు పరిధిలో వారు పనిచేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఎన్నికైన ఎంపీల టీమ్ చాలా బాగుందని, గతంలో ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్ ఉండేదని గుర్తు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com