AP : నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం

AP : నేడే చంద్రబాబు ప్రమాణ స్వీకారం

సీఎంగా చంద్రబాబు ( Nara Chandrababu Naidu ) ఇవాళ ఉదయం 11.27కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. పీఎం మోదీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం ఏ అంశంపై చేస్తారోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపైనా సైన్ చేసే అవకాశం ఉందంటున్నాయి.

తిరుమలకు చంద్రబాబు

శ్రీవారి దర్శనార్థం టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇవాళ తిరుమల రానున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి చేరుకుంటారు. రేపు ఉదయం సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బాబు బస చేసే కాటేజ్, కాన్వాయ్ ప్రయాణించే మార్గాలను భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Tags

Next Story