Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. మోదీ ఏపీ పర్యటన ఖరారు

జూన్ 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ( Chandrababu ) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ ( Narendra Modi ) పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
అటు కాసేపట్లో ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆయన ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపర్చనున్నట్లు సమాచారం. అనంతరం ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలంతా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పంపనున్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూటమికి ఆయన ఆహ్వానం పంపనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ఈ చట్టం రద్దుపైనే సంతకం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రివర్గ సమావేశం ఆమోదం అనంతరం శాసనసభలో చట్టం ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి రాగానే దీనిని రద్దు చేస్తామని టీడీపీ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com