AP : నేడు 5 ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu Naidu ) ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తారు. దాదాపు 13వేల ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేస్తారు.
ట్విటర్‌లో సీఎం చంద్రబాబు నాయుడు బయో మారింది. ఇది వరకు టీడీపీ అధినేత, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ అని ఉండగా తాజాగా దీనికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని యాడ్ చేశారు. ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈమేరకు మార్పులు చేశారు. కాగా టీడీపీ అధినేతకు ట్విటర్‌లో 5.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 11 మందిని ఫాలో అవుతున్నారు.
చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని టీడీపీ ట్వీట్ చేసింది. ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com