AP : నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan MohanReddy) 'మేమంతా సిద్ధం' పేరుతో 21 రోజుల బస్సు యాత్రతో రానున్న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. ఈ రోజు కడప జిల్లా ఇడుపులుపాయ నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
మార్చి 16న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన తర్వాత జగన్ చేపట్టిన తొలి ఎన్నికల ప్రచారం బస్సుయాత్ర. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇప్పటికే రెండు రోజుల ప్రచారం పూర్తి చేసుకున్నారు.
అదేవిధంగా, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా మార్చి 30న అనకాపల్లి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు షెడ్యూల్ చేశారు. నటుడు - రాజకీయ నాయకుడు అనకాపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మే 13న ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
21 జిల్లాలు, 148 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ జగన్ బస్సుయాత్ర ఇడుపులుపాయ నుంచి ప్రారంభమై రాష్ట్ర తూర్పు తీరంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముగియనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com