AP : పవన్ కు ద్వారంపూడి సవాల్

AP : పవన్ కు ద్వారంపూడి సవాల్

పొత్తులు కుదిరిన కొద్దీ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ కు సవాల్‌ విసిరారు కాకినాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ గా కాదు… తన మీద కాకినాడ ఎమ్మెల్యే గా పోటీ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. డైలాగులు కొట్టడం కాదు.. గెలిచి చూపించాలని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులపై పంచ్ డైలాగులు విసిరారు.

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలనేది ఆయన ఇష్టం అనీ.. కానీ.. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు ద్వారంపూడి. పవన్ కళ్యాణ్ పార్టీ కాకినాడలో గుండు సున్నా అవుతారని సెటైర్లు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story