AP : చంద్రబాబు, జగన్ లకు ఈసీ హెచ్చరికలు

టీడీపీ అధినేత చంద్రబాబును ఈసీ హెచ్చరించింది. సీఎం జగన్‌పై వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. ఇటీవల జగన్‌పై చంద్రబాబు మాటల దాడి పెంచిన నేపథ్యంలో వైసీపీ నేతల ఫిర్యాదుతో ఈసీ స్పందించింది. సీఎం జగన్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపై హెచ్చరించిన ఈసీ.. ఇలానే కొనసాగితే ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు భావించాల్సి వస్తుందని పేర్కొంది. ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఈసీఐ జగన్‌కు సూచించింది.
మరోవైపు సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న నకిలీ వీడియోలు, ఫేక్ న్యూస్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన 3గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని పేర్కొంది. డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈవిధంగా స్పందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com