AP: హింసాత్మక ఘటనపై సిట్‌ ఏర్పాటు

AP: హింసాత్మక ఘటనపై సిట్‌ ఏర్పాటు
ఐజీ వినీత్‌ బ్రిజ్‌వాల్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు... నేడు ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతర హింసపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన CEO కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. ఇదే సమయంలో ఈసీ ఆదేశాల మేరకు పల్నాడు, తాడిపత్రి, తిరుపతి సహా ఇతర ఘటనలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. ఏడీజీస్థాయి అధికారి నేతృత్వంలో ఆయా ఘటనలపైదర్యాప్తునకు ప్రత్యక దర్యాప్తు బృందం-సిట్ ను ఏర్పాటు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. వినీత్ బ్రిజ్ వాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లా ఎస్పీల వైఫల్యమే ఘర్షణలకు కారణమని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక ఆధారంగా.. మొత్తం 16 మంది అధికారులపై ఇప్పటికే ఈసీ కొరడా ఝళిపించగా ఇప్పుడు సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. రేపటిలోగా సిట్ నివేదిక సమర్పించనుంది.


హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులు సహా కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లోఎమ్మె ల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేసిన పోలీసులు అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు.. ఏర్పాటు చేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్రసాయుధ బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూంల వద్ద... భద్రతను రెండెంచల నుంచి మూడెంచలకు పెంచారు.

హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న.., అలాగే కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైనా తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనలు చోటుచేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్‌ పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా... 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నారు. ఇప్పటికే 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఏపీకి చేరుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో... స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఉన్న భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత, కౌంటింగ్‌ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం... సీఈవో... క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.

Tags

Next Story