AP : మంత్రిగా నారా లోకేశ్.. బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్

ఏపీ మంత్రిగా నారా లోకేశ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ( Nara Brahmani ) Xలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘లోకేశ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇది నేను గర్వపడే, భావోద్వేగానికి గురైన క్షణం. నూతనోత్సాహంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మీకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ప్రమాణం చేశారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారామె. 1999లో కాంగ్రెస్ నుంచి, 2009లో టీడీపీ నుంచి సాలూరులో ఎమ్మెల్యేఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మరోసారి ఓటమే ఎదురైంది. ఈ ఎన్నికల్లో సాలూరులో బరిలో దిగి వైసీపీ అభ్యర్థి, మంత్రి పీడిక రాజన్నదొరపై విజయం సాధించి ఏకంగా మినిస్టర్ అయ్యారు.
పెనుగొండ ఎమ్మెల్యే ఎస్.సవిత. పూర్తి పేరు సంజీవరెడ్డిగారి సవిత. ఆమె టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌ను ఆమె ఓడించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవిత అనూహ్యంగా బీసీ మహిళ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె 2015 నుంచి టీడీపీ లో క్రియాశీల సభ్యురాలిగా ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com