AP : పెరిగిన పెన్షన్లు.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ

ఏపీలో పెన్షన్ల పెంపుపై సీఎస్ నీరభ్ కుమార్ ( CS Neerab Kumar ) ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా ( NTR Bharosa ) పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేశారు. ఇక నుంచి వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులు, తదితరులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ అందనుంది. పెరిగిన పెన్షన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పగా.. జులై 1న రూ.7వేల పెన్షన్ అందనుంది. అంటే ఏప్రిల్ , మే, జూన్ నెలల అరియర్స్ రూ.3వేలు వస్తాయి.
వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్‌దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com