AP : ఏపీకి పునర్వైభవం తెచ్చేలా తొలి అడుగు: పవన్ కళ్యాణ్

AP : ఏపీకి పునర్వైభవం తెచ్చేలా తొలి అడుగు: పవన్ కళ్యాణ్

ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత, మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. మెగా DSC, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, రూ.4వేలకు పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెక్స్‌ ఫైళ్లపై సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) సంతకాలు చేశారని పేర్కొన్నారు. సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందన్నారు. రాష్ట్రానికి పునర్వైభవం తెచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని అన్నారు.

మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు. కాగా ఈరోజు సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు మెగా డీఎస్సీపై సంతకం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు మెగా డీఎస్సీ అంటూ తెలుగుదేశం పార్టీ మెగా మోసానికి పాల్పడుతోందని వైసీపీ మండిపడింది. ‘25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు. తొలి సంతకంతో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

Tags

Next Story