AP : రెండురోజులు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

AP : రెండురోజులు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు

అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది, విజయనగరం జిల్లాలో ఆరు, మన్యం జిల్లాలో 12, అల్లూరి జిల్లాలోని రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Tags

Next Story