Protem Speaker : ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి?

Protem Speaker : ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి?
X

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈనెల 17న ప్రారంభం అయ్యే చాన్సుంది. గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం. గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో సభలో సీనియర్ సభ్యుడైన రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary ) ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య, చంద్రబాబు సీనియర్లుగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కావడం విశేషం.

Tags

Next Story