AP : టిడిపి సీనియర్లకు గవర్నర్ పదవులు!

ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించిన విషయం తెలిసిందే.
అశోక్ గజపతిరాజు
జనతా పార్టీ తరఫున 1978లో పోటీ చేసారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసారు. మొత్తం 36 యేళ్ళ రాజకీయ జీవితంలో 7 సార్లు ఎంఎల్‌ఏ గానూ, ఒక సారి ఎంపీ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. మోదీ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు.
యనమల రామకృష్ణుడు...
చంద్రబాబు నేతృత్వంలో 2014లో ఏర్పడిన మంత్రి మండలిలో ఈయన స్థానం సంపాదించాడు. శాసనమండలి సభ్యునిగా ఉంటూ మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విభజన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తరపున ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు.
వీరిరువురూ తెలుగుదేశం పార్టీకి జీవనాడి వంటి వారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి గజపతి రాజు పోటీ చేసి గెలుపొందగా యనమల కుమార్తె యనమల దివ్య తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com