Vangalapudi Anitha : కొంతమంది పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తమే ఉంది : హోంమంత్రి వంగలపూడి అనిత

కొంతమంది పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తమే ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anitha ) విమర్శించారు. ఆయా అధికారులు వారి వ్యవహారశైలిని మార్చుకోవాలని ఆమె సూచించారు. అయినా వైసీపీపై ప్రేమ తగ్గకపోతే ఉద్యోగాల్ని వదిలేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవచ్చని సూచించారు. ఈరోజు సింహాచలం అప్పన్నను ఆమె దర్శించుకున్నారు. దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
దిశ పోలీసు స్టేషన్‌లు దిష్టిబొమ్మలుగా మారాయని, వాటి స్థానంలో మహిళా పోలీసు స్టేషన్లు మాత్రమే వుంటాయన్నారు. రాష్ట్రంలో మిస్ అయిన వేలాది మంది మహిళల కేసులను స్టడీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై రాళ్లు ఎవరికి వాళ్ళు వేసుకుంటే మాకేమీ సంబంధం లేదనన్నారు.
ఏపీలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు హోం మంత్రి అనిత. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఆమె, అప్పన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని చెప్పారు. పంచగ్రామాల భూ సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అయితే సాక్షాత్తూ హోంమంత్రే కొందరు పోలీస్ అధికారుల్ని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com