AP : నా కోసం రెండు బటన్లు నొక్కండి.. జగన్‌ పిలుపు

AP : నా కోసం రెండు బటన్లు నొక్కండి.. జగన్‌ పిలుపు

పేదల కోసం ఏపీలో ఎన్నో బటన్లు నొక్కాననీ.. తనకోసం రెండు బటన్లు నొక్కాలని ఓటర్లను కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan). ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మొత్తం రూ.2.70 లక్షల కోట్లు బదలాయించేందుకు 130 సార్లు బటన్లు నొక్కానని గుర్తుచేశారు.

58 నెలల వైఎస్ఆర్సీ పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పాలన చేశానన్నారు. రాష్ట్ర చరిత్రలో పార్టీ, కుల, మత వివక్ష లేకుండా పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. చంద్రబాబు నాయుడుపై యుద్ధానికి నాయకత్వం వహించడానికి అర్జునుడిగా తనను ఆదరించే శ్రీకృష్ణులే ప్రజలని, ప్రతి గడపకు ప్రజలకు అవగాహన కల్పించాలని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభించిన తర్వాత ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. వైజాగ్‌ పోర్టులో బ్రెజిల్‌ నుంచి దిగుమతి చేసుకున్న కంటైనర్‌ నుంచి ఇటీవల డ్రగ్స్‌ పట్టుబడిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాకెట్‌లో చంద్రబాబు, పురంద్రేశ్వరి సన్నిహిత బంధువులు ఉన్నారనీ.. వారు వైఎస్‌ఆర్‌సిపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని కౌంటరిచ్చారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా చంద్రబాబు నాయుడు బ్యాచ్ ఎంచుకుని వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతోందన్నారు.

2014లో టీడీపీ, జేఎస్‌, బీజేపీ కూటమి మేనిఫెస్టోను చూపుతూ వివిధ హామీలపై చంద్రబాబు సంతకం చేసి ఐదేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జగన్ చెప్పారు. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 2.32 లక్షల మంది ఉద్యోగులతో సచివాలయాల ద్వారా ఇంటి వద్ద సేవలను అందించామని.. ఏ గ్రామం వెళ్లైనా చూడొచ్చని అన్నారు సీఎం. జనం కోసం పనిచేసే నాయకుడిని కాబట్టే తనను గుండెల్లో పెట్టుకున్నారని గుర్తుచేశారు జగన్.

Tags

Read MoreRead Less
Next Story