AP : జగన్‌వి చీప్ ట్రిక్స్.. లోకేశ్ కౌంటర్

AP : జగన్‌వి చీప్ ట్రిక్స్.. లోకేశ్ కౌంటర్

ట్విట్టర్ లో మరోసారి జగన్ పై పంచ్ లు విసిరారు నారా లోకేశ్ (Nara Lokesh). సీఎం జగన్‌ (CM Jagan) అయిదేళ్ల అరాచకపాలనతో జనం విసిగిపోయారని పోస్ట్‌ చేశారు. తనిఖీలు, తాయిలాలు లాంటి చీప్ ట్రిక్స్ తోప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని సీఎం జగన్‌ చూస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చెందిన గోడౌన్ లో గిఫ్ట్ డంబప్ ను అధికారులు పట్టుకున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను సీజ్ చేశారు. ''టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్ నైతే పట్టుకున్నారు.. మరి ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్ ను ఎప్పుడు పట్టుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజి బంగారం ఇచ్చినా ప్రజల్లో మీపై నెలకొన్న ప్రజాగ్రహజ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలి'' అని నారా లోకేష్‌ అన్నారు.

'సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు. అందులో ఏముంది? బ్రెజిల్‌ సరుకా? లిక్కర్లో మెక్కిన రూ.3 వేల కోట్లా? లండన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు దాచిన దొంగ పైళ్లా? సమాధానం చెబుతారా డీజీపీ?'' అని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. టీడీపీ లీడర్ల కాన్వాయ్‌ ను రోజూ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా అని లోకేష్‌ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story