PAWAN: పి. గన్నవరంలో గెలుపు తథ్యం

PAWAN: పి. గన్నవరంలో గెలుపు తథ్యం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధీమా.... ధైర్యంగా పోరాడాలని పిలుపు

కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ స్థానంలో జనసేన తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తంచేశారు. పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో ఇవాళ సమావేశమైన పవన్ అక్కడ పార్టీ ఇంఛార్జి గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి నామినేషన్లు వేయటానికి ఇబ్బందులు పెట్టినప్పటికీ జనసేన అభ్యర్థులు ధైర్యంగా పోటీ చేసి గెలిచారని పవన్ ప్రశంసించారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు తగ్గట్లు అప్పట్లో తెలుగుదేశం వారితో కలిసి వెళ్లారని ఆనాటి స్ఫూర్తిని అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ఏపీ దిశదశను నిర్దేశించనున్నందున జనసేనకు ప్రతి స్థానం కీలకమేనని, అందరూ కష్టపడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు.


మరోవైపు వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు.. ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిని..... సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పెన్షన్ ,రేషన్ పంపిణీలో వాలంటీర్ల పాత్ర ఏమీలేదన్న ఆయన.. ఈ పక్రియ నుంచి వారిని దూరంగా పెట్టాలని సీఈవోకు లేఖ రాశారు. అప్పుడే వాలంటీర్లకు.. ఓటర్లతో నేరుగా ఉన్న సంబంధాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. పెన్షన్లను నేరుగా.... లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని కోరారు. బ్యాంకు ఖాతాలు లేనివారు...... గ్రామవార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకునేలా అవకాశం కల్పించాలని సీఈవోకు...... నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.


యథేచ్ఛగా వైసీపీ ఉల్లంఘనలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. యథేచ్ఛగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రార్ధన మందిరాల్లో ప్రచారం చేయకూడదనే నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు.పెద్ద మసీదులో ముస్లిం పెద్దలతో రాజకీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముస్లింల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని మరోసారి అండగా నిలవాలని కోరడం వివాదస్పదంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. అటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా లెక్కచేయకుండా ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా శ్లాబ్ నిర్మాణ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబుతోపాటు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ షంషీర్ అలీబేగ్...... కౌన్సిలర్ సలీం పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఫిర్యాదుతో వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story