AP : కోడెలను వేధించిన కర్మ జగన్‌ను వెంటాడుతోంది: దేవినేని

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను ( Kodela Shivaprasad ) వేధించిన పాపం తాలూకు కర్మ మాజీ సీఎం జగన్‌ను వెంటాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ.కోట్ల విలువైన ఫర్నిచర్‌ను ఇంట్లో పెట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. ‘ఒప్పుకొంటే తప్పు ఒప్పవుతుందా? దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం, రేటు కడతాం అంటే చట్టం ఎలా ఒప్పుకొంటుంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్ సమాధానమివ్వాలి’ అని డిమాండ్ చేశారు.
కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణమని, ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? అని జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ‘‘దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఒప్పు అవుతుందా? ఫర్నిచర్‌కు కక్కుర్తి పడ్డ వాళ్లు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా లూటీ చేశారో అర్థమవుతుంది’’ అని ఉమ విమర్శించారు. నవ్వుతారని కూడా లేకుండా జగన్ చేసిన ఈ పనిని దొంగతనం అంటారా? దోపిడీ అంటారా? చేతివాటం అంటారా? నాటి మంత్రివర్గ సభ్యులు చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. తనపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
ఐదేళ్ల పాటు అరాచక పాలన చేసిన జగన్‌కు జనం 151 సీట్లలో మధ్యలో ఉన్న 5 తీసేసి 11 సీట్లిచ్చి గట్టిగా బుద్ధి చెప్పారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. గొల్లపూడిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com