AP : ఏపీ ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు

AP : ఏపీ ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది? నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎంత లీడ్ వస్తుంది? అన్న అంశాలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొంత మంది సర్వే నివేదికలను రివ్యూ చేసుకుని పందేల్లో పాల్గొంటున్నారు.

ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోంది. అలాగే, పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్సార్​సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు.

వైసీపీ విజయంపై ఎప్పుడూ ధీమాగా ఉండే కడప బెట్టింగ్ టీమ్ సయితం ఫాన్ పార్టీపై వెనకడుగువేయడం గమనించదగ్గ విషయం. సీఎం జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెజారిటీ, కడప ఎంపీ అభ్యర్థులపై ఎక్కువగా బెట్టింగ్‌లు చేస్తున్నారు. పార్టీలో నేతలు గెలుపుకోసం సర్వ శక్తులు వడ్డినట్లే.. అదేస్థాయిలో బెట్టింగ్ టీమ్ స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా పందాలు వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story