AP : ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

AP : ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
X

ఏపీలో ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జులై ౨ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు. జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. వైసీపీ పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సీ.రామచంద్రయ్య, ఇక్బాల్‌పై అనర్హత వేటు పడటంతో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ స్థానాలను ఆశించే వారు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అభ్యర్థుల ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. టీడీపీకి పూర్తి బలం ఉన్నా జనసేన ఎమ్మెల్యేలు కూడా 21మంది ఉన్నారు. స్నేహ బంధంలో భాగంగా జనసేనకు కూడా అవకాశం కల్పిస్తారా, రెండు స్థానాలను టీడీపీ అభ్యర్థులతో భర్తీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పాతవారితోనే ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Next Story