AP : మోడీ, అమిత్ షా వస్తున్నారు.. ఏర్పాట్లు చకచకా!

AP : మోడీ, అమిత్ షా వస్తున్నారు.. ఏర్పాట్లు చకచకా!

బుధవారం ఏపీ సీఎంగా చంద్రబాబు ( Chandrababu ) ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, అమిత్ షా హాజరు కానున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు సమాచారాన్ని అందజేసింది. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా రాక ఖరారైంది. హోంశాఖ కార్యాలయం నుంచి కూడా చంద్రబాబు కార్యాలయానికి స్పష్టమైన సమాచారం అందింది.

వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఆహ్వానాలు పంపించింది ఏపీ సర్కార్. ఎవరెవరు వస్తున్నారు... వారికి చేయాల్సిన ఏర్పాట్లను టీడీపీ కార్యాలయంతో పాటు, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరుండి చూసుకుంటోంది. పర్యటన ఖరారైన నేతలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కడా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు టీడీపీ నేతలు. ప్రముఖులకు ప్రోటోకాల్ సిబ్బంది రాకుండా చూస్తామన్నారు అధికారులు.

Tags

Next Story