Mohan Babu : నా పేరును రాజకీయంగా వాడుకుంటున్నారు.. మోహన్‌బాబు వార్నింగ్

తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని నటుడు, నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం.
చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో మీ మోహన్‌బాబు " అంటూ లేఖలో తెలిపారు.
సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న టైమ్ లోనే రాజకీయాల్లోకి వచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున 1996 నుండి 1997 వరకు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మరణానతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు మోహన్ బాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com