AP : మంగళగిరి ప్రచారంలో నారా బ్రాహ్మణి హల్చల్

AP : మంగళగిరి ప్రచారంలో నారా బ్రాహ్మణి హల్చల్
X

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి సందడి చేస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, తన భర్త నారా లోకేష్ తరఫున ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు.

నారా బ్రాహ్మణి రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో ప్రచారం చేస్తున్నారు. ఒంగోలు నుంచి సీమ వరకూ ప్రచారం చేసేందుకు వెళ్లారు. లోకేష్ వెళ్లడానికి ఒక్క రోజు ముందే మంగళగిరి వచ్చిన నారా బ్రహ్మణి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు బ్రాహ్మణి.

మహిళల కోసం లోకేశ్ తీసుకొచ్చిన స్త్రీశక్తి అనే కార్యక్రమంతో పాటు చేనేతలకు, ఇతర వర్గాలకు సాయం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన విషయం ఆమె జనంలోకి తీసుకెళ్తున్నారు. మంగళగిరి చేనేత చీరలకు బ్రాండింగ్ కల్పించారు. మహిళా ఓటర్లను ప్రత్యేకంగా టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు బ్రాహ్మణి. కూలీలు, వీధి వ్యాపారులు, చేనేతలు, స్వర్ణకారులు, పచ్చళ్ల తయారీదారులు ఇలా అన్ని చోట్లకు వెళ్తున్నారు.

Tags

Next Story