LOKESH: జగన్‌కి 11వ బ్లాక్‌లో సీటు కేటాయించాం

వైసీపీ నేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌కి అసెంబ్లీలోని 11వ బ్లాక్‌లో సీటు కేటాయించామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారా? చట్టాన్ని ఉల్లంఘించడం జగన్ కి అలవాటు. అందుకే ఆయనపై కేసులు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ అడ్డగోలుగా వ్యవహరించారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి' అని మంత్రి లోకేశ్ విమర్శలు చేశారు. అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్‌లాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, కోల్పోయినా ఆయన ప్రజలకు దూరంగానే ఉన్నారని లోకేశ్ విమర్శించారు. పరదాల ప్రభుత్వం పోయాక ఏపీలో పరదాల అమ్మకాలు తగ్గాయని లోకేశ్ సెటైర్లు వేశారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు.
తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇంట్లో చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.5,540 కోట్లు ఖర్చు పెట్టిందని.. కానీ, తమ ప్రభుత్వం రూ.9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించిందని చెప్పారు. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పారు. ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి రూ.15 వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. సభలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ బాధ్యత వైసీపీ నెరవేర్చడం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రతిపక్ష హోదాపై లోక్‍సభ రూల్స్ లో స్పష్టంగా ఉందన్నారు. గతంలో జగన్ కూడా ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు ప్రతిపక్ష హోదాపై జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంకు Z కేటగిరి భద్రత ఉంటే.. జగన్‍కు Z ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉందన్నారు.
ప్రజాప్రయోజనాలపై చర్చ అవసరం
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ప్రతిపక్షనేత జగన్ రెడ్డి వ్యాఖ్యలు విలువలేని భావాన్ని కలిగించాయన్నారు. అధికారంలో దౌర్జన్యాలు, అవినీతికి పాల్పడిన వ్యక్తి ప్రతిపక్షంలో నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు మాని ప్రజావసర బడ్జెట్‌పై చర్చించాలని సూచించారు.
మళ్లీ అదే తప్పు చేస్తున్న జగన్?
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ చేస్తున్న డిమాండ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు హాజరై ప్రజా సమస్యలపై గళం వినిపించే ధైర్యం లేకనే అసాధ్యమైన డిమాండ్లు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే సభకు వచ్చి చర్చించాలని కూటమి నేతలు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన తప్పునే ఇప్పుడు ఆయన పునరావృతం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com