Nara Lokesh : కుర్చీ మడతబెట్టిన లోకేశ్..

వైఎస్ఆర్ సీపీ అధినాయకుడు, సీఎం జగన్ (CM Jagan) చేసిన చొక్కా మడతబెడతాం కామెంట్స్ కు టీడీపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. మీకు సీటు లేకుండా చేస్తామంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. స్టేజిపై ఉన్న కుర్చీని చేతులతో పైకి ఎత్తి మరి మడతపెట్టి నారా లోకేశ్ చూపించడంతో ఫ్యాన్స్ ఊగిపోయారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టీడీపీ ఆధ్వర్యంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేశ్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే అస్సలు ఊరుకునేది లేదని నారా లోకేశ్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా, రైతులు అంటేనే సీఎం జగన్ భయపడిపోతున్నారని అన్నారు. ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్దకు పోలీసులను పంపిస్తున్నారని చెప్పారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి ఇంకెప్పుడు మద్యపాన నిషేధం చేస్తారని జగన్ ను లోకేశ్ ప్రశ్నించారు. ఐదేళ్లుగా విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు.. నిరుద్యోగులను మోసం చేసింది. ఉత్తరాంధ్రలో రాజధానిపై పేరుపై ఇప్పటి వరకు ఒక్క ఇటుకైనా వేశారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని మండిపడ్డారు నారా లోకేశ్ (Nara Lokesh).
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com