Pawan Kalyan : అధికారం కోసం కాదు.. మార్పు కోసం వచ్చా: పవన్‌కల్యాణ్

సీఎం జగన్‌పై (CM Jagan) కానీ తనకు ఎలాంటి ద్వేషం లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. జనసేన (Janasena) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా. అన్యాయాన్ని ఎదిరించేందుకే వచ్చా. ఒక ఆశయం కోసం వచ్చినవాడిని.. ఓడిపోతే శూన్యమనిపించింది.
ప్రజల కష్టాలు నావే అనుకుని బతికేస్తున్నా. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోంది వైసీపీ మమ్మల్ని తొక్కేస్తామంటే కుదరదు.. మేమే మిమ్మల్ని తొక్కేస్తాం. వైసీపీకి తగిన బుద్ధి చెప్తాం.’ అని ఆయన మండిపడ్డారు. 150 మందితో జనసేనను ప్రారంభించామని .. ఇవాళ 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారని చెప్పారు పవన్ కల్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com