AP : నా జీతాన్ని సీఎం సహాయనిధికి ఇస్తా: ఎమ్మెల్యే కొలికపూడి

AP : నా జీతాన్ని సీఎం సహాయనిధికి ఇస్తా: ఎమ్మెల్యే కొలికపూడి
X

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సంవత్సరం పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహకందని స్థితికి పడిపోయిందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని, కొత్త ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడనున్నాయని అన్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యునిగా తన జీతం, ఇతర అలవెన్స్‌లను ముఖ్యమంత్రి సహాయ నిదికి ఏడాది పాటు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

Tags

Next Story