Pawan Kalyan : వైసీపీ తప్పుడు ప్రచారానికి పవన్ చెక్.. 15 ఏళ్లు పటిష్టంగా..

Pawan Kalyan : వైసీపీ తప్పుడు ప్రచారానికి పవన్ చెక్.. 15 ఏళ్లు పటిష్టంగా..
X

ఏపీలో కూటమి చాలా పటిష్టంగా ఉంది. ఎలాంటి గొడవలు, తగాదాలు లేకుండా సాఫీగా సాగుతోంది. ఏపీ అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఒక్క పంచాయితీ కూడా లేకుండా ఏపీకి ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకువస్తోంది. వైసీపీ హయాంలో ధ్వంసమైపోయిన ఏపీని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నారు కూటమి నేతలు. కూటమి ఇలాగే కలిసి ఉంటే ఏపీలో తమకు దిక్కు, మొక్కు ఉండదనే భయం వైసీపీలో మొదలైంది. అందుకే కూటమి ఎలాగైనా విడిపోయి చెల్లాచెదురు అయితే తమ ఆటలు సాగుతాయనేది వారి ప్లాన్. అందులో భాగంగానే రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. కూటమిలో పవన్ ను తొక్కేస్తున్నారని.. త్వరలోనే కూటమి కూలిపోతుందని ఏవేవో చెప్పేస్తున్నారు.

కూటమి వచ్చే ఎన్నికల్లో ఉండదని.. వాళ్లను నమ్మి మోసపోవద్దని, ఏపీని ఎప్పటికైనా అభివృద్ధి చేసేది జగన్ మాత్రమే అంటూ ప్రచారానికి తెర తీశారు. ఈ ఫేక్ ప్రచారం వెనక కూటమిని విడదీయాలనే కుట్ర ఉంది. దీనికి నిన్న పవన్ కల్యాణ్‌ చెక్ పెట్టేశారు. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందే ఓ ప్రకటన చేశారు. కూటమి ఇంకో 15 ఏళ్లు ఏపీలో అధికారంలో ఉండాలని కోరుకున్నారు. కూటమి పటిష్టంగా, సమర్థవంతంగా 15 ఏళ్లు పాలిస్తే ఏపీకి అభివృద్ధిలో తిరుగుండదని చెప్పారు. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని కుండబద్దలు కొట్టేశారు. అక్కడ, ఇక్కడ చెప్పడం ఎందుకు అని స్వయంగా మూడు పార్టీల అధినేతల ముందే ఈ విషయం చెప్పేశారు.

అటు ప్రధాని మోడీ కూడా చంద్రబాబు, పవన్ రూపంలో సమర్థవంతమైన నాయకత్వం ఏపీకి ఉందన్నారు. అన్ని విధాలుగా కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు మోడీ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. దీంతో వైసీపీకి కూటమి ప్రకటనలు మింగుడు పడట్లేదు. ఏదో జరిగిపోయి వారంతా విడిపోతారని అనుకుంటే ఇంకో పదిహేనేళ్ల దాకా తాము ఇలాగే కలిసుంటామని చెప్పడంతో వైసీపీ బ్యాచ్ ఆగమైపోతున్నారు. ఇలాంటి ప్రకటన చేస్తే తాము ప్రశాంతంగా ఎలా పడుకోవాలి అన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నారంట. ఏపీలో కూటమి హయాంలో వస్తున్న కంపెనీలే ఇక్కడ ఎంతటి శాంతిభద్రతలు ఉన్నాయనేది చెప్పేస్తున్నాయి. కూటమిలో ఎలాంటి గొడవలు లేవని తేలిపోతోంది. ఎక్కడో చిన్నా, చితక మనస్పర్థలు కామన్. వాటిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, పవన్ పరిష్కరించుకుంటూనే ఉన్నారు. ఏపీని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు.


Tags

Next Story