AP : తమిళిసై తరఫున పవన్ ప్రచారం

ఆంధ్రాలో కుదిరిన ఎన్డీయే కూటమి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టింది. సౌత్ లో అవసరమైన చోట ఆకర్షణీయమైన లీడర్లు ప్రచారం చేయనున్నారు. తమిళనాడులోనూ బీజేపీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.
టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని స్పీడప్ చేసింది. ఈ కూటమిలోని ప్రజాకర్షక నేతలు ఇతర ప్రాంతాల్లోనూ ప్రచారం చేయబోతున్నారు. తమిళనాడులో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా చేసుకున్న బీజేపీ స్టార్ క్యాంపెయిన్ కు స్కెచ్ గీసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై తరుఫున తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ నేత నారా లోకేష్ ప్రచారం చేశారు. మొన్నటివరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ ను తమిళనాడులో ఎలాగైనా గెలిపించుకోవాలని బీజేపీ డిసైడైంది.
తమిళిసైకి సపోర్ట్ గా పవన్ తో ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించింది. తమిళిసై చెన్నై సౌత్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు వారు ఇక్కడ స్థిరపడి ఉన్నారు. తమిళిసై తరపున జనసేనాని పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com