AP : పిఠాపురం పవన్ కల్యాణ్ గెస్ట్ హౌజ్ రెంట్ ఒక్క రూపాయే!

AP : పిఠాపురం పవన్ కల్యాణ్ గెస్ట్ హౌజ్ రెంట్ ఒక్క రూపాయే!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్ర ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. తాను కాకినాడ జిల్లా పిఠాపురంలో గెలవడంతో పాటు.. మిగతా స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తపన పడుతున్నారు. పిఠాపురాన్ని తన సొంత స్థలంగా మార్చుకుంటానన్న పవన్.. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంట పొలాల్లో ఓ మూడు అంతస్తుల భవనాన్ని పవన్ ఎంపిక చేసుకున్నారు. ఈ భవనం చేబ్రోలు రైతు ఓదూరి నాగేశ్వరరావుది.

బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పూర్తిగా వాహనాలు పార్కింగ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుంది. రెండు, మూడు అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో ఏర్పాటుచేశారు. రైతు ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో భవనాన్ని చాలా ఉదారంగా ఇచ్చేశారట. తనకు అద్దె వద్దని.. కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన పవన్ కు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదే నివాసంలో పవన్ ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. ఉగాది కల్లా పనులన్నీ పూర్తి చేసి ఇక్కడే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించుకున్నారట. దగ్గర్లోని పంట పొలాల్లో హెలీప్యాడ్ ఏర్పాటుచేస్తున్నారు.

Tags

Next Story