Pawan Kalyan : కుమ్మేసిన పవన్.. వందశాతం రిజల్ట్.. చిరు రికార్డ్ బ్రేక్

Pawan Kalyan : కుమ్మేసిన పవన్.. వందశాతం రిజల్ట్.. చిరు రికార్డ్ బ్రేక్
X

సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో జనసేన హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడవ ప్రధాన పార్టీగా ఉన్న జనసేన ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో అనూహ్యంగా ఏపీలో రెండవ అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. కూటమిలో భాగంగా 21 పరిమిత స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసి క్లీన్ స్వీప్ తో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అధికార వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోగా జనసేన 21 స్థానాలకు గాను 21 స్థానాలలో గెలుపొంది వైసీపీని అధిగమించింది. ఒకటి కాదు రెండు కాదు వైసీపీ కంటే ఏకంగా 10 స్థానాలు అధికంగా గెలుపొంది చరిత్ర సృష్టించింది.

ఏపీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీలలో టీడీపీ తరువాత జనసేన రెండవ స్థానంలో నిలిచింది. పాలకొండ, పోలవరం, ఉంగుటూరు మినహా మిగిలిన 18 స్థానాలలో జనసేన అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై అధిక్యం సాధిస్తూ వచ్చారు. రెండు, మూడు రౌండ్లు ముగిసిన తరువాత నెమ్మదిగా ఉంగుటూరు అభ్యర్ధి ధర్మరాజు, పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజులు పుంజుకున్నారు. రెండు ఎంపీ స్థానాల్లో నెగ్గిన జనసేన... వందశాతం రిజల్ట్ సాధించిన పార్టీగా సరికొత్త చరిత్ర సృష్టించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపెట్టి 18 సీట్లలో అభ్యర్థులను గెలిపించుకుంటే.. పవన్ 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని అన్నయ్య ఫీట్ ను బ్రేక్ చేశాడు.

Tags

Next Story