AP : పవన్ స్పాంటేనిటీ.. ఫ్లెక్సీ చూసి ఏపీ సీఎంకు సూటి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. పొలిటికల్ థ్రిల్లర్ మారాయి ఏపీ ఎన్నికలు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పవన్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. పూర్తిగా ఎన్నికల ఊపును తన వైపు తిప్పుకున్నాడు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత మరింత స్పీడ్ పెంచారు జనసేనాని.
తనదైన శైలిలో ప్రచారం చేస్తూ సీఎంపై ప్రశ్నలు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్. తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఉత్తరాంధ్ర పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు పవన్. హోర్డింగ్ పై జగన్ బొమ్మతో పాటు కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అని రాసి ఉండటంతో.. దానిపై స్పందిస్తూ..కలలు నిజం చేయడానికి అంట… మెగా డీఎస్సీ ఇచ్చి మీ కలలు నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా ? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు సారథ్యంలోని కూటమి అధికారంలో రాగానే..మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని మాటిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com