AP : పవన్ కల్యాణ్‌కు అరుదైన అవకాశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అరుదైన అవకాశం లభించింది. పవన్‌ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. దీంతో ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన ఈ నెల 20న న్యూయార్క్ బయల్దేరి వెళ్లనున్నారని తెలుస్తోంది..
దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కల్యాణ్ దక్కించుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.
టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు. ఏపీ అభివృద్ధి కావాలంటే కూటమి అభ్యర్థులకే ఓటేయాలంటూ పవన్ ప్రచారం పెంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com