Pawan Kalyan : మోడీ, పవన్ మీటింగ్‌లో అకీరా స్పెషల్ ఎట్రాక్షన్

ఢిల్లీలో ఇటీవల ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్ ఫ్యామిలీ భేటీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన కొడుకు అకీరా నందన్ ను ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిన పవన్.. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఎన్డీయే మీటింగ్ లో పాల్గొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ భారీ మెజారిటీ గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్టీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కురుమారు అకిరా నందన్తో కలిసి ఢిల్లీ వెళ్లారు.
ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నివాసంలో పవన్ కళ్యాణ్ కుటుంబసమేతంగా మోదీని కలిసి తీసుకున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అకీరాను పరిచేయడంతో మోడీ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. మరోవైపు.. తండ్రిపై తన ప్రేమను చాటుతూ అకీరా నందన్ రూపొందించిన స్పెషల్ వీడియోను పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ షేర్ చేశారు.
పవన్ ఇంటికి రావడంతో.. మెగా ఫ్యామిలీలో ఆనందం ఉప్పొంగింది. పొలిటికల్ గా పవర్ చూపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కుటుంబసభ్యులు ఘనస్వాగతం పలికారు. తల్లికి, అన్నయ్య చిరంజీవి కాళ్లకు, వదిన కాళ్లపై పడ్డారు పవన్. చిరు తమ్ముడిని అలింగనం చేసుకున్నారు. తనయుడు అకిరా నందన్ కూడా వీడియోలో హైలైట్ అయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com