AP : నేడు ఏపీకి ప్రధాని మోదీ

AP : నేడు ఏపీకి ప్రధాని మోదీ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీకి రానున్నారు. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ఎల్లుండి పీలేరులో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.

ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్‌షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు.

Tags

Next Story