AP : పేరు మార్పు కోసం గెజిట్ పబ్లికేషన్ రెడీ చేసుకుంటున్నా

ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇండి కూటమి అద్భుత విజయం సాధించడంతో.. తాను ముందే చెప్పిన సవాల్ ప్రకారం పేరు మార్పుకు సిద్ధపడ్డారు. వైసీపీ ఓడితే తన పేరు చివర రెడ్డి చేర్చుకుంటానని గతంలో చెప్పారు ముద్రగడ.
ఫలితాల మరునాడు బుధవారం మీడియాతో మాట్లాడిన పద్మనాభం.. తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని చెప్పారు. సవాలులో తాను ఓడిపోయాను కాబట్టి తన పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని చెప్పారు.
జగన్ కోసం కష్టపడ్డాననీ.. జగన్ తనను గౌరవించకపోవడం బాధాకరం అన్నారు పద్మనాభం. తన రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని తెలిపారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలను జనం ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు. ఏదేమైనా గెలిచిన కూటమికి శుభాకాంక్షలు అందించారు పద్మనాభం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com