AP: ఉద్ధృతంగా సాగుతున్న కార్మికుల సమ్మె

AP: ఉద్ధృతంగా సాగుతున్న కార్మికుల సమ్మె
ఆందోళనబాట పట్టిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు... నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికుల సమ్మె...ఉద్ధృతంగా సాగుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య ఉద్యోగులు...... బిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రైవేటు కార్మికులతో...... చెత్త తొలగించటాన్ని నిరసిస్తూ అనంతపురం నగరపాలక సంస్థ ఆవరణలో చెత్త వేసి ఆందోళన చేశారు. దీక్ష శిబిరం వద్ద మోకాళ్లపై..... అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు శవయాత్ర నిర్వహించారు. NTR జిల్లా నందిగామలో....... కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మద్దతు తెలిపారు. అనంతరం 110 మంది కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి... అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తిరువూరులో సచివాలయం ఉద్యోగులతో... పారిశుద్ధ్య పనులు చేయించడానికి అధికారులు వెళ్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడంతో... ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యేని అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరోవైపు సమస్యలు పరిష్కరించాలంటూ... ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు.. తాడేపల్లిలో భారీ ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు... ధర్నాలో పాల్గొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు వచ్చిన క్షేత్ర సహాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన హామీలను... అమలు చేయాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీల సమ్మె 24వరోజూ కొనసాగింది. NTR జిల్లా నందిగామలోని R.D.O కార్యాలయం ఎదుటఅంగన్వా డీలు ఆందోళన చేశారు. మైలవరంలో CITU ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖలో అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా...GVMC గాంధీ పార్క్ లో శవాసనాలు వేస్తూ అంగన్ వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో నల్ల బ్యాడ్జీలు, జెండాలతో అంగన్వాడీలు.. నిరసన తెలిపారు. రేపటి నుంచి విజయవాడ ధర్నా చౌక్ లో 24గంటల ధర్నా నిర్వహిస్తామని...అంగన్వాడీ సంఘాల నేతలు తెలిపారు. ఆరో తేదీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో... రిలే నిరాహారదీక్షలు చేస్తామని వెల్లడించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నాకు తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చిన్నారులకు జాతీయ నేతల వేషధారణ వేయించి నిరసన తెలపారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో పేరడీ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్త ఒకరు సోదెమ్మ అలంకరణలో సోది చెబుతూ నిరసన తెలిపారు.

Tags

Next Story