AP : కుప్పంలో చంద్రబాబు పూజలు

టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కుప్పంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుప్పానికి చేరుకున్న ఆయన శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన శతరత్న జీర్ణోద్ధారణ ప్రతిష్ఠ మహా కుంభాభిషేకంలో పాల్గొని పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో జరగనున్న సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు కుప్పంలోనే పర్యటించనున్నారు.
రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని తెలిపారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖీలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com