AP : ఆంధ్రాలో రేవంత్ పబ్లిక్ మీటింగ్.. ఎప్పుడంటే..!

AP : ఆంధ్రాలో రేవంత్ పబ్లిక్ మీటింగ్.. ఎప్పుడంటే..!

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ కు ఉన్న ఊపును ఆంధ్రాలో ఉపయోగించుకోవాలని చూస్తోంది ఆ పార్టీ హైకమాండ్. తమ తురుఫుముక్క, దూకుడు స్వభావం ఉన్న రేవంత్ రెడ్డిని ఆంధ్రాలోనూ ప్రచారానికి వాడుకోవాలని భావిస్తోంది. జగన్ పై కోపాన్ని తరచుగా తెలంగాణ ప్రసంగాల్లోనూ రేవంత్ చూపిస్తుంటారు. ఇదే జోరు ఆంధ్రా సభల్లోనూ కొనసాగించేలా స్కెచ్ గీసింది కాంగ్రెస్ హైకమాండ్.

కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడు ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది. ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీడును ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొనేలా ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఈ నెల 15న విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపింది. ఇటు షర్మిల.. అటు రేవంత్.. జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. ఐతే.. చంద్రబాబుపై రేవంత్ ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. బాబుపై రేవంత్ విమర్శలు చేయబోరని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story