AP: ఆంధ్రప్రదేశ్‌లో హింసపై రంగంలోకి సిట్‌

AP: ఆంధ్రప్రదేశ్‌లో హింసపై రంగంలోకి సిట్‌
హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం... ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మందితో దర్యాప్తు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్‌ రంగంలోకి దిగింది. I.G వినీత్ బ్రిజ్ లాల్ ఆధ్వర్యంలోని 13 మంది సభ్యుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేస్తున్నారు. అల్లర్లలపై ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి....., తిరుపతిలో జరిగిన ఘటనలపై...సిట్‌ బృందం నేరుగా విచారణ జరుపుతోంది. హింసాత్మక ఘటనలపై నమోదైన F.I.Rలను బృందం పరిశీలించింది. అల్లర్ల ఘటనలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సిట్‌కు చేరినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీలో విచారణ చేపట్టారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై...తిరుపతి మహిళా వర్సిటీ ప్రాంగణంలో హత్యాయత్నం జరిగింది. అదనపు SP సౌమ్యలత, D.S.P రవి మనోహరాచారి బృందం ఆ రోజు జరిగిన ఘటనపై పూర్తి వివరాలు సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి తీసుకున్నారు. దీనిపై త్వరలోనే నివేదికను సమర్పించనున్నారు.


తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడులు, ఘర్షణలపై సిట్ బృందం విజయవాడ నుంచి అనంతపురం బయల్దేరింది. రాత్రికి అనంతపురం చేరుకోనున్న దర్యాప్తు అధికారులు...ఆదివారం ఉదయం తాడిపత్రిలో ఆ తర్వాత అనంతపురంలోనూ విచారణ చేపట్టనున్నారు. మరికొన్ని కేసుల్లో నమోదైన F.I.Rలను ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని బృందం దర్యాప్తు పునఃసమీక్ష చేస్తోంది. ఆయా జిల్లాల్లో అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

వైసీపీది రక్త చరిత్ర

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఏపీలో రక్త చరిత్ర సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులు, చెవిరెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి, పెద్దారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ బృందం.... సిట్ అధినేత ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పెన్ డ్రైవ్ రూపంలో సమర్పించారు. జగన్ తో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరు అధికారులు హింసాకాండకు కుట్రలు చేశారని వారి కాల్ డేటా బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

Tags

Next Story