AP : 50 ఏండ్లకే 4 వేల పింఛను..టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్

AP : 50 ఏండ్లకే 4 వేల పింఛను..టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన (TDP - Janasena) కూటమి ముందుకెళ్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన టీడీపీ నిన్న మంగళగిరిలో జనసేనతో కలిసి బీసీ డిక్లరేషన్ ను రిలీజ్ చేశారు. బీసీలకు 50 ఏండ్లకే పించన్ అందజేస్తామని వెల్లడించారు. పది అంశాలతో కూడిన బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేశారు.

బీసీ డిక్లరేషన్ లో కీలక అంశాలు

ప్రస్తుతం ఉన్న రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతాం

బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం

బీసీల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం

బీసీ సబ్ ప్లాన్ ద్వారా రాబోవు ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం

సామాజిక న్యాయ పరిశీలన కమిటీల ఏర్పాటు

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం

చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ తీర్మానం

అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు

బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు ఇస్తాం

జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం

చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్దరిస్తాం.

స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.

పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు

శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం

విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం

షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.

Tags

Read MoreRead Less
Next Story