AP: బాబాయ్‌ను చంపినప్పుడు కూడా జగన్ ఇంతలా స్పందించలేదు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్... పిన్నెల్లి అంత మంచోడు లేడంటూ కామెంట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ములాఖత్ సందర్భంగా నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇకనైనా జగన్ అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.
ఎన్నికల సందర్భంగా మాచర్లలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఏ2గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డిని కూడా అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్‌పై ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఈవీఎంలు పగలగొట్టిన కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని జగన్ కలవడం ఆయనకు మద్దతిచ్చినట్లు అవుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే జగన్‌పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండు రోజులు పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ మాచర్ల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసు సహా మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి..
ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని ఈనెల 8, 9 తేదీల్లో నెల్లూరు జైల్లోనే విచారణ చేసేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్‌పై దాడితో పాటు, పాలవాయి గేట్‌లో ఓ వ్యక్తిపై హత్యాయత్నం కేసులో పూర్తి దర్యాప్తు కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రోజు చొప్పున, రెండు రోజుల పాటు పోలీసులు విచారణ చేసేందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిన్నెల్లిని నెల్లూరు జైల్లో సీసీ కెమెరాలు, పిన్నెల్లి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. డీఎస్పీ స్థాయి అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారణ చేయవచ్చని న్యాయస్థానం అనుమతినిచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com