AP : నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన!

డీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లకు గాను పొత్తులో భాగంగా టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికి ఖరారైన అభ్యర్థులు.. శ్రీకాకుళం-కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విశాఖపట్నం-ఎం.భరత్, విజయవాడ-కేశినేని శివనాథ్ (చిన్ని), ఒంగోలు-మాగుంట రాఘవరెడ్డి, గుంటూరు-పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు-వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నరసరావుపేట-లావు శ్రీకృష్ణదేవరాయలు, చిత్తూరు (ఎస్సీ)-దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజంపేట-సుగవాసి బాలసుబ్రమణ్యం, నంద్యాల-బైరెడ్డి శబరి. ఇంకా అమలాపురం(ఎస్సీ), బాపట్ల(ఎస్సీ), కర్నూలు, కడప, ఏలూరు, అనంతపురం, హిందూపురం స్థానాలకు అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు.
టీడీపీ (TDP) తరఫున భార్యాభర్తల పోటీ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి ఆయన, కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆ పార్టీలో లోక్ సభ, శాసనసభ స్థానాల నుంచి భార్యాభర్తలకు ఛాన్సివ్వడం ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో తెలంగాణలోని మక్తల్, దేవరకద్ర అసెంబ్లీ స్థానాల నుంచి దయాకర్ రెడ్డి దంపతులు టీడీపీ తరఫున పోటీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com