CBN: జగన్‌ను ప్రజలు క్షమించరు

CBN: జగన్‌ను ప్రజలు క్షమించరు
వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు పిలుపు....తెలుగుదేశంలో భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు సృష్టించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు క్షమించరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. అక్రమ కేసులకు భయపడి....... ప్రజలు బయటకు రాకుంటే..మీ జీవితాలకు మీరే మరణశాసనం రాసుకున్నట్టని వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్రకార్యాలయం NTRభవన్‌లో వివిధ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం నియోజకవర్గాలకు చెందిన వైకాపా శ్రేణులు... పెద్ద ఎత్తున తరలి వచ్చి... చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. రాబోయే మూడు నెలల్లో ఇంటికెళ్లే జగన్ రాజధానిని విశాఖకు మారుస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.


మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనన్న వ్యక్తి ఇప్పుడు మహిళల భర్తలు, బిడ్డలతో ఏళ్ల తరబడి తాగించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఏపీలో పరిశ్రమలన్నీ పారిపోయి, ఒక్కరికీ ఉద్యోగం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు MLA.. జగన్‌కు బినామీగా 2 జిల్లాల్లో ఇసుక కొల్లగొట్టారని ఆరోపించారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌ను దక్కించుకోవాలని ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించారని విమర్శించారు. ఓటమి భయంతోనే..తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సుప్రయాణం హామీని కాపీ కొట్టి జగన్‌ అమలు చేస్తానంటున్నారని విమర్శించారు. విశాఖలోనే రూ.40వేల కోట్ల భూ కబ్జాలు జరిగాయని, ఆ భూ దందాలన్నీ 22ఏ నిబంధన ఉల్లంఘించే జరిగాయని ఆరోపించారు. ఓట్ల దొంగలు వచ్చి బతికున్న వారినీ చంపేస్తున్నారని దుయ్యబట్టారు. పెదకూరపాడు ఎమ్మెల్యే జగన్‌కు బినామీగా రెండు జిల్లాల్లో ఇసుక కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు.


ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినంత మాత్రాన పెరిగిన నిత్యావసరాలు, అధిక బిల్లులు, ధరలు రూపేణా దోచింది తిరిగి ఇస్తారా అని నిలదీశారు. ఒకప్పుడు రొయ్య మాదిరి మీసాలు మెలేసిన ఆక్వా రైతులు ఇప్పుడు చితికిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే యజ్ఞాలు, హోమాలు, పూజలు చేశానని, తన కోసం కాదని వెల్లడించారు.

అంతకుముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడ్రోజులుగా చేస్తున్న మహాచండీయాగం, హోమాలు ముగిశాయి. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం,సుదర్శన నారసింహ హోమంలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన..వేద పండితులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రిత్వికులతో యాగం చేశారు. యాగం, హోమం, పూజా కార్యక్రమాల్లో తెలుగుదేశం ముఖ్యనేతలతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags

Next Story